Friday, September 21, 2012

నువ్వే .... నువ్వే....


కనుల కొలనులో కళ కళలాడే కలువవు నువ్వే....
మది మందిరంలో మధనం మరిపించి మకరందమును కురిపించగల మహారాణి నువ్వే....
గుండెల గుడిలో నా గుప్పెడు మనసుతో నిత్యారాధన  అందుకుంటున్న గుణవతివి నువ్వే....
నా పాటలలో పరవశం నువ్వే....
నా పాదాలకు గమ్యం నువ్వే....
నా నోటి మాటలకు మకుటం నువ్వే....
నా నాలుక మీద నిత్యం నాట్యం చేసే నాట్య మయూరివి  నువ్వే.... నువ్వే....నువ్వే....

4 comments:

  1. బాగుంది మీ భావం.
    చిత్రం చక్కగా అమిరింది.
    కనుల కొలనులో కళ కళలాడే కులవవు నువ్వే(కలువవు అని సరిచేయండి)
    Keep on writing.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. evaraa "Nuvvu"? adi telchandi tvaragaa!!!

    ReplyDelete