గోరుముద్దలు పెట్టి గోరింతవాడిని కొండంత వాడిని చేసిది ఒక ఇంతియే... బుడి బుడి అడుగులు నుండి వడివడిగా అడుగులు నేర్పేది ఒక వనితనే.... అక్షరాల నేర్చిన నుండి అత్యున్నత స్తాయి చేరే వరకు మన వెనుక అమ్మలా ఉండేది ఒక అబలనే..... నిరంతర నిర్విరామ పనులతో నిదురలేక అలసినప్పుడు తన చల్లని ఒడిలో నిద్రపుచ్చేది ఒక నారిమణి నే... ఆనందంతో తన అక్కున చేరుచుకొని మనల్ని ఆనందతీరాలకు చేర్చేది ఒక అపురూప ఆడదినే... అనారోగ్యంతో అడుగు కూడా వేయలేనప్పుడు అహర్నిశలు మనకు సేవచేసేది ఒక స్త్రీ మూర్తినే... ఇలా మగవాడి ప్రతీ ప్రగతి లోను ప్రక్కనుండేది ఒక పడతియే... కష్ట కడలి లో కంటికి కనురెప్పలా కాపాడేది ఒక కాంతామణియే... అలాంటి స్త్రీ జాతి పైన పురుషోత్తమల దారుణ అసాంఘిక చర్యలు.... అలాంటి ఆడ జాతి పైన అమానుష అత్యాచార ఘటనలు.... అలాంటి కన్నతల్లుల మీద ఈ కీరాతకమైన కీచక రాచ క్రీడలు... ఇటువంటి మగ జాతిలో పుట్టినందుకు..మధనపడుతూ...మగసిరితో మురిసిపోతున్న మృగ మహారాజులకు నా మనవి
" బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలచుకో..... నవ సమాజపు నది ఒడ్డున ముద్దు బిడ్డలా నిల్చున్న నేడు తలచుకో.... అది గొడ్డు కాదు ఆడదని నిజం ఇప్పటికైనా తెలుసుకో...."
మృగాల వలె కాకా మనుషులవాలే జీవిస్తూ..... మగసిరితో కాకా మానవత్వంతో ముందుకు సాగుతూ, ఇకనుండి అయిన స్త్రీ జాతి సమస్తం కిరాతుకల కబంద హస్తాలలో అస్తమయం కాకుండా పాటుపడదాం. నవ స్త్రీ జాతిలో ధైర్యాన్ని నింపుదాం ..మన భారత దేశ గౌరవాన్ని కాపడుకొందాం ....
No comments:
Post a Comment